తనకు పదవులపై కోరిక లేదు.. స్పష్టం చేసిన నాగబాబు

తనకు పదవులపై కోరిక లేదు.. స్పష్టం చేసిన నాగబాబు

తనకు పదవులపై కోరిక లేదు.. స్పష్టం చేసిన నాగబాబు

 

అమరావతి జూలై 21 (మీడియా ఫోకస్ );పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసిన వారి కుటుంబాలకు జనసేన పార్టీ అండగా నిలబడింది. పార్టీ కోసం పనిచేసి మృతి చెందిన జనసేన కార్యకర్తల కుటుంబాలకు ప్రమాద బీమా చెక్కులను అందజేసింది. జనసేన కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో.. ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల చెక్కును జనసేన నేత నాగబాబు అందించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. తనకు పదవులపై కోరిక లేదని స్పష్టం చేశారు.వివిధ కారణాల వల్ల చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు ఇప్పటిరకు రూ.1745 కోట్లు అందజేశామని నాగబాబు తెలిపారు. గతంలో మూడు వేల మంది రైతులకు లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించిన విషయాన్ని గుర్తుచేశారు. ఒకప్పుడు నిర్మాతగా తాను నష్టపోతే తన తమ్ముడు అండగా నిలిచాడని నాగబాబు గుర్తుచేసుకున్నారు. అందుకే తాను కూడా తనవంతుగా ఎంతో కొంత సాయం అందిస్తానని చెప్పారు. తనకు పదవులపై కోరిక లేదని తెలిపారు. పవన్‌ కల్యాణ్‌ ఆశయాలు నిలబెట్టేందుకు తనకు చేతనైనంత చేస్తానని అన్నారు. తనకు ఓపిక ఉన్నంత వరకు జనసేన కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు.అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కొన్ని రోజుల్లోనే వైసీపీ శవ రాజకీయాలు చేయడం మొదలుపెట్టిందని నాగబాబు విమర్శించారు. గత ఐదేళ్లలో వారు చేసిన నేరాలు, ఘోరాలు బయటపెడతామని తెలిపారు. అబద్ధాలు చెప్పడంలో జగన్‌కు డాక్టరేట్‌ ఇవ్వాలని ఎద్దేవా చేశారు. నేడు ఏపీలోరాష్ట్రపతి పాలన అడగడానికి జగన్‌కు సిగ్గుండాలని అన్నారు. ఇంతకంటే దిగజారకండి అని చెప్పే కొద్దీ మరింత దిగజారుతున్నారని అన్నారు. జగన్‌ హయాంలో జరిగిన అవినీతికి శిక్ష తప్పదని హెచ్చరించారు.కూటమి అధికారంలోకి రావడం వల్ల ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందని నాగబాబు ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఐదేళ్లు ఏపీలో స్వర్ణయుగం నడుస్తుందని తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సారథ్యంలో ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు.

Tags:

About The Author

Media focus Editor Nagaraju Picture

 Editor  of MEDIA FOCUS FOR PEOPLE News paper and senior journalist since from 2009 worked in various news paper as  an executive editor, Buero Incharge, CEO.

In addition, we maintain (www.mediafocusnews. com) a news website. Similarly we are also managing Digital Paper (ePaper) www.epaper.mediafocusnews. com. We publish every news item coming to this site based on the certification of the authorities. Area, Village, Zonal and District wide reporters for our paper collect news and send it via e-mail or WhatsApp. They will be edited by the sub-editors and then published on the website and in the newspaper.

Related Posts

Latest News

రాడర్ స్టేషన్ కోసం..12 లక్షల చెట్లు కొట్టేస్తారా..!? రాడర్ స్టేషన్ కోసం..12 లక్షల చెట్లు కొట్టేస్తారా..!?
రాడర్ స్టేషన్ కోసం..12 లక్షల చెట్లు కొట్టేస్తారా..!?  ధర్మ చక్రం సంస్థ అధ్యక్షురాలు కుమారి యామినీ లక్ష్మీహైదరాబాద్ ఆగష్టు 9 (మీడియా ఫోకస్ న్యూస్ )వికారాబాద్ జిల్లా...
ఎసిబి వలలో భారీ తిమింగలం. 
ఆదివాసీల అభివృద్ధికి అవసరమైన కృషి చేస్తా
సంపన్న వర్గ ప్రయోజనాలకోసం పనిచేసే ప్రభుత్వాలు మాకెందుకు..
క్విట్ ఇండియా ఉద్యమ వ్యతిరేకులు.. ఇవాళ దేశాన్ని పాలిస్తున్నారు
తాను శాసనసభలో కనిపిస్తేనే సీఎం రేవంత్ రెడ్డికి కంటగింపుగా ఉంది.
సుప్రీం కోర్టు తీర్పు 20 ఏళ్లుగా పోరాటం విజయం