వైసీపీ ప్రభుత్వం ఆర్థిక దోపిడీ వల్ల రాష్ట్రానికి తగ్గిన రూ. 76,795 కోట్ల ఆదాయం

వైసీపీ ప్రభుత్వం ఆర్థిక దోపిడీ వల్ల రాష్ట్రానికి తగ్గిన రూ. 76,795 కోట్ల ఆదాయం

వైసీపీ ప్రభుత్వం ఆర్థిక దోపిడీ వల్ల రాష్ట్రానికి తగ్గిన రూ. 76,795 కోట్ల ఆదాయం

 

అమరావతి జూలై 26 (మీడియా ఫోకస్ న్యూస్);: గత వైసీపీ ప్రభుత్వం అవలంభించిన ఆర్థిక దోపిడీ వల్ల రాష్ట్రానికి రూ. 76,795 కోట్ల ఆదాయం తగ్గిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా చేయడంతో పెట్టుబడులు తగ్గిపోయాయని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశంలో శుక్రవారం గత ప్రభుత్వ ఆర్థిక అవకతవలకపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019-24 మధ్య రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతిందని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను సైతం మళ్లించారని దుయ్యబట్టారు. డ్వాక్రా మహిళల నిధులను కొట్టేశారు. పంచాయతీలకు వెళ్లాల్సిన నిధులను దారి మళ్లించారు. ప్రభుత్వ ఆస్తులను, విశాఖలో ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టారని విమర్శించారు.పోలవరం పూర్తయి ఉంటే ఏపీకి రూ. 45 వేల కోట్ల ఆదాయం వచ్చేదని వివరించారు. ఇసుక అక్రమాల ద్వారా రాష్ట్రానికి రూ. 7 వేల కోట్లు , గనుల దోపిడీ ద్వారా రాష్ట్రానికి రూ.9,750 కోట్ల మేర నష్టం జరిగిందని అన్నారు. రాజధాని అమరావతిని కొనసాగించి ఉంటే విశ్వనగరంగా అభివృద్ధి చెందేదని, రూ. 3లక్షల కోట్ల ఆస్తి , 7 లక్షల ఉద్యోగాలు వచ్చేవని బాబు పేర్కొన్నారు.ఏపీకి ఆదాయ వనరులు భారీగా తగ్గాయని, వృద్ధిరేటు 13.5 నుంచి 9. 5 శాతానికి పడిపోయిందని వెల్లడించారు. 2014-19 టీడీపీ హయాంలో రాష్ట్రాభివృద్ధి కోసం కొత్త పోర్టులు ప్రారంభించామని వివరించారు. ఏపీకి సుదీర్ఘ తీర ప్రాంతం ఉండడం కలిసి వచ్చే అంశమని అన్నారు. కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరందిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Tags:

About The Author

Media focus Editor Nagaraju Picture

 Editor  of MEDIA FOCUS FOR PEOPLE News paper and senior journalist since from 2009 worked in various news paper as  an executive editor, Buero Incharge, CEO.

In addition, we maintain (www.mediafocusnews. com) a news website. Similarly we are also managing Digital Paper (ePaper) www.epaper.mediafocusnews. com. We publish every news item coming to this site based on the certification of the authorities. Area, Village, Zonal and District wide reporters for our paper collect news and send it via e-mail or WhatsApp. They will be edited by the sub-editors and then published on the website and in the newspaper.

Related Posts

Latest News

రాడర్ స్టేషన్ కోసం..12 లక్షల చెట్లు కొట్టేస్తారా..!? రాడర్ స్టేషన్ కోసం..12 లక్షల చెట్లు కొట్టేస్తారా..!?
రాడర్ స్టేషన్ కోసం..12 లక్షల చెట్లు కొట్టేస్తారా..!?  ధర్మ చక్రం సంస్థ అధ్యక్షురాలు కుమారి యామినీ లక్ష్మీహైదరాబాద్ ఆగష్టు 9 (మీడియా ఫోకస్ న్యూస్ )వికారాబాద్ జిల్లా...
ఎసిబి వలలో భారీ తిమింగలం. 
ఆదివాసీల అభివృద్ధికి అవసరమైన కృషి చేస్తా
సంపన్న వర్గ ప్రయోజనాలకోసం పనిచేసే ప్రభుత్వాలు మాకెందుకు..
క్విట్ ఇండియా ఉద్యమ వ్యతిరేకులు.. ఇవాళ దేశాన్ని పాలిస్తున్నారు
తాను శాసనసభలో కనిపిస్తేనే సీఎం రేవంత్ రెడ్డికి కంటగింపుగా ఉంది.
సుప్రీం కోర్టు తీర్పు 20 ఏళ్లుగా పోరాటం విజయం